సాంప్రదాయేతర ఇంధన వనరులను సమర్థవంతంగా వినియోగిస్తున్నారు
1 min read
బయో గ్యాస్ ప్లాంట్ వినియోగాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలన
దేవాలయంలో పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు అభినందనీయం
జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: సంప్రదాయేతర ఇంధన వనరులను సమర్థవంతంగా వినియోగిస్తున్న దేవాలయ అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అభినందించారు. ద్వారకాతిరుమలలోని గోశాలను, బయో గ్యాస్ (గోబర్ గ్యాస్) ప్లాంట్ వినియోగాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ద్వారకాతిరుమలలో శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో గోవర్ధన ప్రాజెక్ట్ లో భాగంగా 1 టిపిడి (టన్ పర్ డే ) సామర్ధ్యం కలిగిన బయో గ్యాస్ ప్లాంట్ ను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. దేవాలయంలోని గోశాలలోని ఆవు పేడ ,, అన్న ప్రసాదం కేంద్రం నుండి వచ్చే వ్యర్థాల ద్వారా బయో గ్యాస్ ఉత్పత్తి అవుతుందన్నారు. దేవాలయంలో పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ అభినందించారు.ఈ సందర్భంగా దేవాలయ డీఈ సూర్యనారాయణ మాట్లాడుతూ తమ ఆలయంలో బయో గ్యాస్ 4 టిపిడి సామర్ధ్యానికి సరిపడా ముడి సరుకు అందుబాటులో ఉంటుందని, కావున తమ ఆలయానికి 4 టిపిడి సామర్ధ్యం కలిగిన బయో గ్యాస్ ప్లాంట్ మంజూరుకు సిఫారసు చేయవలసిందిగా కలెక్టర్ ను కోరారు. ఈ విషయంపై వెంటనే ప్రతిపాదనలు సమర్పిస్తే, ప్రభుత్వానికి పంపించి మంజూరయ్యేలా చూస్తానని కలెక్టర్ వెట్రిసెల్వి చెప్పారు. ఆలయ అధికారులు పాల్గొన్నారు.

