డాక్టర్:బూసి అంజయ్య సేవలు చిరస్మరణీయం
1 min read

ఆయన లేకపోవడం కుటుంబ సభ్యులకు తీరని లోటు
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రస్తుత ఏలూరు జిల్లా కొవ్వలి గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు డాక్టర్:బూసి అంజయ్య జాయింట్ డైరెక్టర్ (రిటైర్డ్) మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సేవలు అందించారు. ఆయన సేవా దృక్పథం,కీర్తి ప్రతిష్టలు ఏపీలో ప్రతి పేదవారిని తాకాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఆయన తుది శ్వాసను 24-10-20 25న దైవ సన్నిధి చేరారు. బూసి అంజయ్యకు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు బూసి సురేంద్ర, సి వాయిస్ ఛానల్ అధినేతగా, రెండవ కుమారుడు బూసి సుచింద్ర, ఐ ఎఫ్ ఎస్ గా, కుమార్తె కొండ్రు సునీత, అల్లుడు కొండ్రు తులసీదాస్ డిప్యూటీ కమిషనర్ ఇన్ కం టాక్స్ అధికారి గా స్థిరపడ్డారు. ఆయన పెద్ద కార్యక్రమం స్థానిక కండ్రిక గూడెం చింతలపూడి రోడ్ శుభలేఖ ఏ/సి కళ్యాణ మండపం హాల్లో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున డాక్టర్లు,రాజకీయ ప్రముఖులు, ఉద్యోగ,వ్యాపారవేత్తలు,వివిధ రంగాలకు చెందిన సామాజికవేత్తలు,బంధుమిత్రులు మరియు శ్రేయోభిలాషులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో జర్నలిస్ట్ ప్రతినిధులు కుటుంబ సభ్యులు స్వగ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన లేకపోవడం కుటుంబ సభ్యులకు తీరనిలోటని సభా వేదికపై విచ్చేసిన పలువురు వక్తలు కొనియాడారు.


