ఎస్.టి.యు డైరీ…క్యాలెండర్ల ఆవిష్కరణ
1 min readమండల విద్యాశాఖ అధికారి-1 అయినా శ్రీ టీ.సత్యనారాయణ మరియు మండల విద్యాశాఖ అధికారి-2 అయినా శ్రీ జగన్నాథం వారి ద్వారా ఎస్.టి.యు డైరీ,క్యాలెండర్ల ఆవిష్కరణ, సమస్యల పై ప్రాతినిధ్యం
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: మండల విద్యాశాఖ అధికారి-1 అయినా శ్రీ టీ.సత్యనారాయణ మరియు మండల విద్యాశాఖ అధికారి-2 అయినా శ్రీ జగన్నాథం వారి ద్వారా ఎస్.టి.యు. డైరీ, క్యాలెండర్లను ఆవిష్కరింప చేయడం జరిగింది. ఈ సందర్భంగా,12వ పిఆర్సి, మభ్యంతర భృతి, ఆర్థిక బకాయిల చెల్లింపు, సిపిఎస్/ జిపిఎస్ రద్దు, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు, 2002 హిందీ పండితులకు పాత పెన్షన్, ఏకీకృత సర్వీస్ రూల్స్, జీవో 223 రద్దుచేసి అర్హులైన స్కూల్ అసిస్టెంట్స్ కు జె.ఎల్ పదోన్నతులు, ప్లస్ టు పాఠశాలల కొనసాగింపు, కారుణ్య నియామకాలు జిల్లా యూనిట్ గా చేపట్టడం, ఉన్నత పాఠశాలలో బోధనేతర సిబ్బంది రేషనలైజేషన్, పురపాలక పాఠశాలల్లో పోస్టుల అప్గ్రేడేషన్, కేజీబీవీ ఉపాధ్యాయులకు ఎంటిఎస్,1998, 2008 డిఎస్సీ ఎంటిఎస్ ఉపాధ్యాయులకు 62 సంవత్సరాల పదవీ విరమణ వయస్సు,ఉద్యోగ భద్రత తదితర సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ చూపాలని ఎస్టియు మండల శాఖ డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష కార్యదర్శులు వై వెంకటేష్, కే శరణప్ప, అలాగే సీనియర్ నాయకులు, జే.రమేశ్, ఎస్ పోతరాజు, జి దొడ్డబసప్ప,గోపాల్, బీటీ ఖలందర్, ఎం ధనుంజయ, కే హనుమంతప్ప,లక్ష్మీ రెడ్డి,మూసా,శేఖరప్ప,అంజునాయక్,కె . మంజుల, మొదలైన ఉపాధ్యాయులు మరియు ఎంఆర్సి, సిబ్బంది పాల్గొనడం జరిగింది.