ప్రమాదానికి పొంచి ఉన్న రహదారి..
1 min read

నిత్యం రహదారిపై పాదరక్షకులు ,ద్విచక్ర వాహనాలు, ఆటోలు ,స్కూలు బస్సులు ప్రయాణం
నెలకావస్తున్న పట్టించుకోని అధికారులు, భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు
ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలో నుంచి పెద్ద పూజర్లకు వెళ్లే రహదారిపై పెద్దపెద్ద గుంతలు పడి రహదారి అద్వానంగా మారింది. ఇక్కడ నిత్యం పాదరక్షకులు ,ద్విచక్ర వాహనాలు, ఆటోలు ,స్కూలు బస్సులు ప్రయాణం చేస్తుంటారు.ఆ రోడ్డుపై వెళ్తున్న వారంతా ఎక్కడ ప్రమాదానికి గురవుతామని కళ్ళు పెద్దవి చేసుకొని ప్రమాదానికి ఎక్కడ గురవుతామని భయం భయంగా వెళుతున్నారు. అదుపు తప్పింది అంటే ప్రమాదానికి గురవుతారు. వర్షం వచ్చిందంటే రోడ్డుపై ఏర్పడిన గుంతల్లోకి నీరు చేరుకొని రహదారి పై వెళుతున్న పాదరక్షకులు గుంతలో కాలు పెడితే అంతే సంగతులు ఆ రోడ్డుపై ప్రయాణిస్తున్న రైతులు, మహిళలు, వాహనదారులు రోడ్డుపై ఇంత గుంతలు పడిన అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రమాదాలు జరగకముందే జాగ్రత్త తీసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పొరపాటున ఈ రోడ్డు పై ప్రమాదం జరిగితే తగిన అధికారులే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కనుక రోడ్డుపై పడిన గుంతలను మరమ్మత్తులు చేసి ప్రమాదన బారిన పడకుండగా చూడాలని ప్రజలు కోరుచున్నారు.


