పేదలకు సొంత ఇంటి కల నెరవేరుస్తాం..
1 min read

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ గా అమలు చేసినట్టే, పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేస్తూ వారికి ఉచితంగా ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు గృహ నిర్మాణానికి సైతం కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందిస్తూ త్వరలోనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తామని, గత వైసీపీ ప్రభుత్వంలో లాగా నివాసయోగ్యం కానీ ప్రాంతాల్లో కాలనీల నిర్మాణం పేరుతో కోట్లాది రూపాయలు అక్రమాలకు పాల్పడి దోచుకున్న వైసీపీ నాయకుల తీరు లాగా కాకుండా పేదలకు మెరుగైన జీవనస్థితిగతులను అందించేలా వారి సొంత ఇంటి కలలను సాకారం చేయడానికి కృషి చేస్తున్నామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం పలువురు నియోజకవర్గ కూటమి నాయకులు, అధికారులు ప్రజలు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కలిసి పలు ఆహ్వాన పత్రికలను పుష్పగుచ్చాలను అందించారు.ఏలూరు రూరల్ మండలం అధ్యక్షులు నంబూరి నాగరాజు ఆధ్వర్యంలో జాలిపూడి గ్రామానికి నూతనంగా ఎంపికైన గ్రామ పెద్దలు బృందం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పలు గ్రామాల్లో నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటిని పరిష్కరించేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.

