కార్తీక మాసం సందర్భంగా మద్దికి పోటెత్తిన భక్తులు
1 min read

ఆలయ అర్చకులతో పంచామృత అభిషేకం,ప్రత్యేక పూజలు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: కార్తీకమాసం శనివారం ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలము,గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దేవస్థానము ఆలయ ముఖ మండపం నందు పంచామృతఅభిషేకం ఆలయ అర్చకులు,వేద పండితులు, ఆద్వర్యములో జరుపబడినది. ఈ కార్యక్రమం నందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనినారు. కొత్తపేట శ్రీ శారధా కళాక్షేత్రం కళాశాల చిన్నారులచే కూచిపూడి నృత్యం నిర్వహించినారు. ఈ రోజు మద్యాహ్నం గం.04.00 లవరకు శ్రీ స్వామి వారి ఆలయమునకు వివిధ సేవల రూపేణా రూ.4,12,520/-లు సమకూరినది. శ్రీ స్వామి వారికి స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు సుమారు 6100 మంది భక్తులకు అన్నదానము జరుపబడినది. స్వామి వారి దర్శనమునకు విచ్చేసిన ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ అసిస్టెంట్ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన తెల్పినారు.


