NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ శిరిడి సాయిబాబా పాదుకలు మా ఇంటికి రావడం అదృష్టంగా భావిస్తున్న

1 min read

మేయర్ నూర్జహాన్ పెదబాబు దంపతులు

హిందూ,ముస్లిం,క్రైస్తవులను ఆకట్టుకున్న ఆధ్యాత్మిక గురువు శ్రీ షిరిడి సాయిబాబా

శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిర్ సేవకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

 ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:  శ్రీ షిరిడి సాయిబాబా వారు ధరించిన పాదుకలు మేయర్ ఇంటికి రావడం  అదృష్టంగా భావిస్తున్నామనీ నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్-ఎస్ ఎం ఆర్ పెదబాబు దంపతులు అన్నారు. మేయర్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూశ్రీ షిరిడి సాయిబాబా వారి వారసులు మహాల్సపతి కుటుంబం యొక్క ముని మనవాళ్ళ ద్వారా స్థానిక ఎస్ ఎం ఆర్ నగర్ లో ఉన్న మేయర్ నూర్జహాన్ పెదబాబు ఇంటికి బాబా వారి పాదుకలు  తీసుకువచ్చారనీ మేయర్ తెలిపారు.హిందూ,ముస్లిం క్రైస్తవుల భక్తులను ఆకట్టుకున్న మహా ఆధ్యాత్మిక గురువు బాబా వారు అన్నారు. అటువంటి గురువుగారి యొక్క పాదుకలు వారి ఇంటికి రావడం సంకల్ప బలంగా భావిస్తున్నామనీ మేయర్ నూర్జహాన్ అన్నారు. మేయర్  కుటుంబాన్ని,ఏలూరు గ్రామాన్ని,బాబా వారి భక్తుల సంకల్పాన్ని నెరవేరుస్తూ.బాబావారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకున్నామనీ మేయర్ నూర్జహాన్ పెదబాబు తెలిపారు. కార్యక్రమంలో ఆదివారపేట శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిర్ చైర్మన్ఇసుకపల్లి తాతారావు (ఐటిఆర్),ఆలయానికి చెందిన పలువురు సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నా రు.కార్పొరేటర్లు జున్నూరు కనక నరసింహారావు,సబ్బన్న శ్రీనివాసరావు,దేవరకొండ శ్రీనివాసరావు,పాము శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.

About Author