వ్యాధి నిర్ధారణలో రేడియాలజీ పాత్ర కీలకం
1 min read

మెడికవర్ హాస్పిటల్ లోఇంటర్నేషనల్ రేడియాలజీ డే
కర్నూలు హాస్పిటల్, న్యూస్ నేడు : ఇంటర్నేషనల్ డే ఆఫ్ రేడియాలజీ సందర్భంగా కర్నూలు మెడికోవర్ హాస్పిటల్లో రేడియాలజిస్టుల దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెడ్ ఆఫ్ రేడియాలజీ డా. సి.ఏ. సంతోష్ వర్మ (MBBS, MD RD), కన్సల్టెంట్ రేడియాలజిస్ట్ డా. కిరణ్ (MBBS, MDRD (SVIMS)) పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైద్యులు రేడియాలజీ విభాగం ఆధునిక వైద్యరంగంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నదని, వ్యాధుల నిర్ధారణలో ఆధునిక ఇమేజింగ్ టెక్నాలజీల వినియోగం రోగుల చికిత్సను మరింత సమర్థవంతంగా చేస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డా. ఎం. నాగ సురేష్ (MD, DM (Neuro)) – కన్సల్టెంట్ న్యూరో ఫిజీషియన్, డా. విశ్వకుమార్ కె.ఎస్ (MBBS, MS, MCH) – కన్సల్టెంట్ న్యూరో సర్జన్ పాల్గొని రేడియాలజీ విభాగం సేవలను ప్రశంసించారు.అలాగే క్లస్టర్ హెడ్ శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు ఈ వేడుకలో పాల్గొని వైద్యులను అభినందిస్తూ, రేడియాలజీ సేవల ద్వారా మెడికోవర్ ఆసుపత్రి కర్నూలు ప్రజలకు అందిస్తున్న నాణ్యమైన వైద్య సేవలను ప్రశంసించారు.

