నవంబర్ 25న విభిన్న ప్రతిభావంతుల క్రీడోత్సవాలు
1 min read

అల్లూరు సీతారామరాజు స్టేడియంలో కార్యక్రమాలు
అసిస్టెంట్ డైరెక్టర్ బి.రామ్ కుమార్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు3వ తేదీన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవము సందర్భంగా ఈనెల 25వ తేదీన ఏలూరులో అల్లూరి సీతారామరాజు స్టేడియం లో ఉదయం 9 గంటల నుండి విభిన్న ప్రతిభావంతులకు క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.రామ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ క్రీడా విభాగాలలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని, 600 మందికి పైగా విభిన్న ప్రతిభావంతులు క్రీడా పోటీలలో పాల్గొంటారన్నారు. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఈనెల 25వ తేదీన ఏలూరులో అల్లూరి సీతారామరాజు స్టేడియం లో క్రీడా పోటీలను ప్రారంభించి, ముఖ్యఅతిధిగా పాల్గొంటారన్నారు. క్రీడా పోటీలలో విభిన్న ప్రతిభావంతులు అందరూ పాల్గొనాలని రామ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

