కూటమి ప్రభుత్వం తక్షణమే లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వాలి
1 min readసిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ),ఏలూరు 28వ డివిజన్ శాఖ కార్యదర్శి మావూరి విజయ,బి. కె.ప్రసాద్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఇంటి స్థలాలను పెంచి ఇవ్వాలని రెండవ రోజు అర్జీల నమోదు కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా పేదవాళ్లకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు అధికారం చేపట్టి ఎన్నికలు ఎనిమిది నెలలు గడుస్తున్న పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని ఆ దిశగా గత ప్రభుత్వం మంజూరు చేసిన పట్టణ ప్రాంతాల్లో సెంటు భూమిని రెండు సెంట్లుగా మార్పు చేసి పట్టాలు జారీచేసి వారికి ఇళ్ల స్థలాలు అందజేయాలని, అలానే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగా ఫిబ్రవరి 10వ తేదీన పూర్తి చేసిన అర్జీలను జిల్లా కలెక్టర్ గారికి అందించే కార్యక్రమంలో లబ్ధిదారులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ ఇళ్ల స్థలాలను లబ్ధిదారులకు తక్షణమే అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుని,ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్,సమితి సభ్యులు బళ్ల కనకదుర్గారావు,బి.శ్రీదేవి,ఆలూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.