NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆరు తాలూకా ఎన్నికలు నిర్వహించుటకు హడక్ కమిటీ ఏర్పాటు

1 min read

డిసెంబర్ 3వ తేదీన జిల్లాల విభజనలో భాగంగా కార్యక్రమం

ఉమ్మడి జిల్లా ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పశ్చిమగోదావరి కేంద్రం భీమవరం మండల అభివృద్ధి అధికారి కార్యాలయ సమావేశ మందిరంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏపీ ఎన్జీజివోస్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ప్రస్తుతానికి ఉమ్మడి జిల్లా పరిధిలో వుందని జిల్లాల విభజన కార్యక్రమంలో భాగంగా. పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న ఆరు తాలుకా యూనిట్ ఎన్నికల నిర్వహించుటకు అడ్ హక్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని.ఈ కార్యక్రమం డిసెంబర్ 3 వ తారీఖున నిర్వహిస్తున్నామనిరాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డి.వి రమణ హాజరవుతారని తెలిపారు.ఈ అడ్ హాక్ కమిటీ కి భీమవరం ట్రెజరీ లో పనిచేస్తున్న యు. పాండురంగారావు వ్యవహరించి ఎన్నికల ప్రక్రియ జరుపుతారని శ్రీనివాస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెనుమరెడ్డి శ్రీనివాస్,ఉమ్మడి జిల్లా కార్యదర్శి నెరుసు రామారావు,అన్ని యూనిట్ల అధ్యక్ష,కార్యదర్సులు. పెన్షనర్లు సంఘం నాయకులు కె.కామరాజు ఇతర డిపార్ట్మెంట్ సంఘ నాయకులు పాల్గొన్నారు.

About Author