NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉపాధ్యాయ, పోలీస్ ఉద్యోగం పొందిన కురువ కులస్థులకు సన్మానం

1 min read

ఉమ్మడి కర్నూలు జిల్లా కురువ సంఘం

కర్నూలు, న్యూస్​ నేడు:  ఉమ్మడి కర్నూలు జిల్లాలో గొర్రెల కాపరులుగా జీవనం సాగిస్తున్న కురువ కులస్థులు 2025 సంవత్సరంలో మెగా డీస్సీ లో ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులు మరియు పోలీస్ కానిస్టేబుళ్లుగా ఉద్యోగం పొందిన కురువ కులస్థులు అందరూ కూడా తమ పేర్లు, ఉద్యోగం, చిరునామా, ఫోన్ నెంబర్ తో సహ పూర్తి వివరాలు తేదీ :10-12-2025 లోగ కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎం. కె. రంగస్వామి ఫొన్ నెంబర్:9032741194 కి వివరాలు వాట్సాప్  ద్వారా తెలుపగలరని జిల్లా కురువ సంఘం అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు జిల్లా కార్యవర్గ సమావేశం లో కోరారు.  త్వరలో అందరికీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో సన్మానించిచదలిచినామని ఆయన తెలిపారు. కురువ కులస్థులు అందరూ ఎలాంటి సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్న వారు తప్ప కుండా గ్రామంలో, మండలంలో, జిల్లాలో ఉన్న కురువ సంఘం నాయకులతో అన్ని విషయాలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశం లో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కె. రంగస్వామి, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న జిల్లా ఉపాధ్యక్షులు బి. వెంకటేశ్వర్లు, పెద్దపాడు ధనుంజయ, టి. ఉరుకుందు, కత్తి శంకర్ నగర కురువ సంఘం అధ్యక్షులు తవుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి బి. రామకృష్ణ, జిల్లా నాయకులు పాలసుంకన్న, బి. సి. తిరుపాల్, పెద్దపాడు పుల్లన్న,కొత్తపల్లి దేవేంద్ర, కె. వెంకటేశ్వర్లు, దివాకర్, కొండన్న, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

About Author