ఇండియన్ ఆయిల్ వ్యాపారంలో అభివృద్ధి చెందాలి
1 min read

వాహన చోదకులకు బహుమతుల పంపిణీ
నందికొట్కూరు, న్యూస్ నేడు: ఇండియన్ ఆయిల్(పెట్రోల్ డీజిల్)బంక్ రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ నాయుడు అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో మిడుతూరు రహదారిలో ఉన్న తమ్మడపల్లె విక్టర్ బ్రదర్స్ ఇండియన్ ఆయిల్ బంక్ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం బంక్ దగ్గర జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహేష్ నాయుడు హాజరయ్యారు. వాహన చోదకుల సమక్షంలో భారీ కేకును కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మహేష్ నాయుడు,పట్టణ ఎస్సై చంద్రశేఖర్,శ్రీరామ థియేటర్ అధినేత రామిరెడ్డి,తమ్మడపల్లి విక్టర్,శేఖర్ ప్రజలకు బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూవ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా మూడు వృద్ధి చెందాలన్నారు.రెండో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగాఅభివృద్ధి చెందుతూ వాహనదారులకు మంచి సేవలు అందిస్తూ పారదర్శకతను పాటిస్తూ ప్రజల మన్ననలు పొందాలన్నారు.సిబ్బందికి వాహనదారులకు మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అరుణ్, వినోద్,నవీన్ కుమార్ పాల్గొన్నారు.


