NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే

1 min read

ఆలూరు న్యూస్ నేడు:  ఆలూరు పట్టణంలో ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీకు మద్దతు తెలిపిన ఆలూరు వైయస్సార్​సిపి ఎమ్మెల్యే  బుసినే విరుపాక్షి ఆలూరు  వైయస్సార్​సిపి ఎమ్మెల్యే  బుసినే విరుపాక్షి  మాట్లాడుతు… ఆదోని జిల్లా అయితే ఆదోని పక్కన్న ఉన్న నియోజకవర్గలు మంత్రాలయం, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు అభివృద్ధి చెందుతాయి అన్నారు..ఆదోని అనేది 4 నియోజకవర్గాలకు మధ్యలో ఉంది కాబట్టి అందరికీ దగ్గరవుతుందన్నారు.కర్నూల్ మా నియోజకవర్గనికి చాలా దూరం అవుతుంది, అదే ఆదోని జిల్లా అయితే మాకు దగ్గర అవుతుంది అన్నారు.ఆదోని ప్రాంతం అని విధాలుగా అభివృద్ధి చెందింది కాబ్బటి జిల్లా చేయాలి అన్నారు.కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆదోని జిల్లా చేయకపోతే రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు  కచ్చితంగా ఆదోని జిల్లా చేయాలని మా నాయకుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి కి చెప్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్​  అభిమానులు పాల్గొన్నారు.

About Author