NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉపాధ్యాయులపై మానసిక ఒత్తిడి తగ్గించండి !

1 min read

ఎస్ టి యు డిమాండ్ 

పత్తికొండ, న్యూస్​ నేడు:  ఉపాధ్యాయులపై మానసిక ఒత్తిడిని తగ్గించాలని ఎస్టియు మండల ప్రధాన కార్యదర్శి మారుతి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం  పత్తికొండ స్థానిక ఎస్టియు ప్రాంతీయ కార్యాలయంలో ఎస్టియు మండల అధ్యక్షుడు ఆవుల నాగరాజు అధ్యక్షతన మండల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి మారుతి మాట్లాడుతూ, పదవ తరగతి 100 రోజుల ప్రణాళిక ఒత్తిడితో కూడుకొని ఉన్నదని, టీచర్లు సెలవు దినాల్లో పనిచేయడం వల్ల పిల్లలకు, ఉపాధ్యాయులకు మానసిక ఒత్తిడి పెరిగి వారిలో ప్రతికూల ప్రభావం ఏర్పడుతుందని,కావున యాక్షన్ ప్లాన్ లో సెలవులు మినహాయించి ఉపాధ్యాయులపై మానసిక ఒత్తిడిని తగ్గించాలని అప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వెంటనే ప్రభుత్వం ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండవ శనివారం ,ఆదివారం ,సంక్రాంతి సెలవులు రోజులలో కూడా ఉపాధ్యాయులతో పని చేయించడం చాలా దారుణం అన్నారు. కాబట్టి వెంటనే సెలవులను మినహాయించి యాక్షన్ ప్లాన్ ను అమలు చేయాలని వారు ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ యు మండల ఆర్థిక కార్యదర్శి మండ్లవెంకటేశ్వర్లు, జిల్లా కౌన్సిలర్లు చంద్రశేఖర్ రెడ్డి, బలరాం, చంద్రశేఖర్, హల్తెన్న , ఇక్బాల్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

About Author