NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాల్యవివాహాలను అరికడదాం..సూపర్వైజర్ సుశీల

1 min read

చాగలమర్రి రూరల్(నేడు): బాల్య వివాహాల వలన అనేక అనారోగ్యాలకు గురవుతారని, బాల్య వివాహాలను అరికడదామని ఐసిడిఎస్ సూపర్వైజర్ సుశీల అన్నారు. గురువారం చాగలమర్రిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల్య వివాహాలు చేసినవారికి, హాజరైన పెద్దలకు చట్టపరమైన చర్యలు సంబంధిత అధికారులు తీసుకుంటారన్నారు. బాల్యవివాహాలు జరిపే ప్రదేశాలను గుర్తించి సమాచారం అందిస్తే వివాహాలు నిలిపివేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు, వైద్య అధికారులు ప్రతిజ్ఞ చేశారు.

About Author