ఎడ్యుకేషన్ పై అవగాహన కల్పించిన ఆర్యూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ యూనిట్
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: జాతీయ సేవాపథకం స్ఫూర్తితో వాలంటీర్లు సమాజసేవలో భాగస్వాములు కావాలని రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వి. వెంకట బసవరావు పిలుపునిచ్చారు. యూనివర్సటీ ఇంజినీరింగ్ కాలేజీకి సంబంధించిన యూనిట్ 4 ఆధ్వర్యంలో స్పెషల్ క్యాంపుల నేపథ్యంలో గురువారం పి. రుద్రవరం గ్రామంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విద్యార్థులను , బడి పిల్లలని వారి తల్లిదండ్రులను సమావేశపరిచి వీరి ఆద్వర్యంలో ఎస్ . రవి , ఎస్ . నాగ చంద్రుడు ల సహాయంతో విమెన్ చైల్డ్ వైల్ఫేర్ ఆక్టివిటీస్ స్కిట్ రూపంలో చేసి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ విధ్యార్థిని విద్యార్ధులకు గుడ్ టచ్, న్యూట్రిషన్, అవేర్నెస్ ఆన్ ఇంపార్టెన్స్ ఆఫ్ చైల్డ్ ఎడ్యుకేషన్ పై అవగాహన కల్పించారు. ఎస్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపులో మహిళలు పిల్లల సంక్షేమం కార్యక్రమాలు నిర్వహించారు.

