పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేద్దాం..
1 min read

శిక్షణ ఇస్తున్న నోడల్ ఆఫీసర్ జగదీష్ చంద్ర రెడ్డి..
చాగలమర్రి, న్యూస్ (నేడు): ఈనెల 21న జరుగు పల్స్ పోలే కార్యక్రమం విజయవంతం చేద్దామని నోడల్ ఆఫీసర్ డాక్టర్ జగదీష్ చంద్ర రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమావేశ భవనంలో పల్స్ పోలియో కార్యక్రమం పై వైద్య ఆరోగ్య సిబ్బందికి ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. 0 నుండి ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయాలన్నారు. మండలంలో 5,868 చిన్నపిల్లలు ఉన్నారన్నారు. ప్రాథమిక వైద్యశాల పరిధిలో రెండు బృందాలుగా ఏర్పడి ,3 రోజులు పోలియో చుక్కలు వేస్తారన్నారు. 32 టీములు, ఒక మొబైల్ టీం, ఒక ట్రాన్సిట్ పాయింట్ ఏర్పాటు చేశామన్నారు. మొదటిరోజు పల్స్ పోలియో తర్వాత రెండు రోజులు ఇంటింటా పోలియో చుక్కలు వేస్తారన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అంజలి, డాక్టర్ సుల్తానా, ఇమ్రాన్, ఐసిడిఎస్ సూపర్వైజర్ సుశీల, హెల్త్ సూపర్వైజర్ రామలింగారెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ విజయభారతి, ఎం పి హెచ్ ఈ ఓ సుబ్బరాయుడు, హెల్త్ అసిస్టెంట్ మనోహర్, ఆరోగ్య, ఆశ, కార్యకర్తలు, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.

