NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ ఆర్టీసీ ఎండీ ని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ ఇన్చార్జి బి. లక్ష్మన్న

1 min read

మంత్రాలయం న్యూస్ నేడు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి దర్శనానికి వచ్చిన  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ , మాజీ డిజిపి ద్వారకా తిరుమలరావు ను రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమీటీ అధ్యక్షులు , మంత్రాలయం జనసేన పార్టీ ఇన్చార్జి బి. లక్ష్మన్న ,మండల జనసేన పార్టీ అధ్యక్షులు రవిచంద్ర తో కలిసి మంత్రాలయం లో పద్మనాభ తీర్థు వసతి గృహంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.  ముందుగా ఆయన కు శాలువా కప్పి , పూలమాలలు వేసి సన్మానించారు. అనంతరం  మంత్రాలయానికి యాత్రలు ఎక్కువ సంఖ్యలో వస్తుండంతో ఆర్టీసీ బస్టాండ్ ను ఆధునికీకరణ చేయవలసిన అవసరం ఎంతైనా  ఉందన్నారు. అనంతరం మంత్రాలయం లోని ఆర్టీసి బస్టాండ్ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.  ఈ కార్యక్రమంలో  ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు , ఎమ్మిగనూరు డీఎం  మద్దిలేటి , తదితరులు ఉన్నారు.

About Author