జాతీయ స్థాయి ర్యాంకింగుల్లో ఆర్యూ మంచి స్థానాన్ని సంపాదించడానికి కృషి చేయాలి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: జాతీయ స్థాయి ర్యాంకింగుల్లో రాయలసీమ యూనివర్సిటీ మంచి స్థానాన్ని సంపాదించడానికి అందరూ కలిసికట్టుగా కృషిచేయాలని యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వి. వెంకట బసవరావు పిలుపునిచ్చారు. ఈ రోజు వర్సిటీ కాన్ఫరెన్సుహాలులో పి.జి. మరియు ఇంజినీరింగ్ విభాగాల అధ్యక్షులు, కోఆర్డినేటర్లు ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వర్సిటీలో టీచింగ్ లెర్నింగ్ వాతావరణాన్ని పెంపొందించడానికి చేపడుతున్న చర్యలను ఆయన వివరించారు. ప్రతి విభాగానికి సెమినార్లు లేదా కాన్ఫరెన్స్ నిర్వహించడానికి కేటాయించిన 50 వేలరూపాయల నిధులు సద్వినియోగం అయ్యేలా చూడాలని ఆయన సూచించారు. అదే విధంగా సైన్స్ విభాగాలవారికి పరికరాలు, కెమికల్స్, స్టేషనరీ కొనుగోలుకుకూడా తగిన నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అధ్యాపకులంతాకూడా టీచింగ్ ప్లానుతోపాటు టీచింగ్ డైరీతో రానున్న సెమిస్టరుకు సిద్ధంగా ఉండాలన్నారు. నూతన విద్యావిధానానికి అనుగుణంగా వివిధ కోర్సుల సిలబస్లో మార్పులు చేర్పులు చేసుకోవడానికి తగిన ప్రణాళికతో సిద్ధంకావాలన్నారు. అధ్యాపకులతో విద్యార్థులంతా లైబ్రరీని వినియోగించుకోవాలన్నారు. సమయానుకూలంగా IQAC విభాగానికి సమాచారం అందించాల్సిందిగా ఆచార్య బసవరావు శాఖాధిపతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయ కుమార్ నాయుడు, యూనివర్సిటీ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య సి. విశ్వనాథ రెడ్డి, ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య పి.వి. సుందరానంద్, డీన్ ఆఫ్ అకడమిక్ అఫైర్స్ ఆచార్య సి.వి. కృష్ణారెడ్డి, IQAC డైరెక్టర్ ఆచార్య ఆర్. భరత్ కుమార్ తోపాటు వివిధ పి.జి. మరియు ఇంజినీరింగ్ విభాగాల అధ్యక్షులు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

