ప్రభుత్వ ఆసుపత్రిలో మొదటి సిజేరియన్ తల్లి బిడ్డ క్షేమం
1 min read

మొదటి సిజేరియన్ ద్వారా జన్మించిన నవజాత శిశువు
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్ సీ) ఆస్పత్రిలో మొదటిసారిగా వైద్యులు సిజేరియన్ చేశారు. మండల పరిధిలోని చెరుకుచెర్ల గ్రామానికి చెందిన మహిళకు మంగళవారం మధ్యాహ్నం మిడుతూరు ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ తిరుపతి ఆధ్వర్యంలో డాక్టర్లు సిజేరియన్ చేయడంతో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.ఆస్పత్రిలో పరికరాలు లేకపోవడం వల్ల ఇంతవరకు ఆపరేషన్లు చేయలేదని ప్రస్తుతం పరికరాలు మరియు డాక్టర్లు ఉన్నందున ఆపరేషన్ చేయడం జరిగిందని అవసరమైన వారికి సిజేరియన్ ఆపరేషన్లు ఇక్కడే చేస్తామని ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని డాక్టర్ తిరుపతి తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యులు గైనకాలజిస్ట్ డా.సుష్మ,డా శారద,డా అశ్విన్న కుమార్,డా మునిస్వామి మరియు సిబ్బంది మూర్తుజావళి, సూర్యం,శ్యామల,రత్న, సువేద,లాబ్ టెక్నిషియన్స్ సత్యనారాయణ,జబీన్,శ్రీజచంద్రకళ,శేఖర్ పాల్గొన్నారు.

