NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యూటీఎఫ్ డైరీ ,క్యాలెండర్ ఆవిష్కరణ: యూటీఎఫ్

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపలి మండల శాఖ మండల అధ్యక్షులు రాజేంద్ర ఆధ్వర్యంలో ప్యాపలి మండల విద్యావనరుల కేంద్రంలో మండల విద్యాధికారులు మహేశ్వర రెడ్డి, వెంకటేష్ నాయక్  చేతుల మీదుగా యూటీఎఫ్ 2026 డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరించారు.కార్యక్రమంలో యూటీఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి అబ్దుల్ లతీఫ్ మాట్లాడుతూ యూటీఎఫ్ డైరీ ప్రతి ఉపాధ్యాయుని వద్ద ఉండవలెనని అందులో ఉపాధ్యాయ సర్వీస్ రూల్స్ తో పాటు విద్యా సంబంధ సంపూర్ణ సమాచారం ఉంటుంది అని అన్నారు.ఉపాధ్యాయుల సంక్షేమం కోసం రాజీలేని పోరాటం చేస్తున్న ఏకైక సంఘం యూటీఎఫ్ అని ,భవిష్యత్ లో పిఆర్పీ,ఐఆర్ కొరకు మనకు రావాల్సిన ఆర్థిక బకాయిల కొరకు పోరాటాలు చేయాల్సి ఉందని అన్నారు.కార్యక్రమంలో యూటీఎఫ్ ప్యాపలి మండల సహాధ్యక్షులు అబ్దుల్ రహీం,నాగమణి తో పాటు యూటీఎఫ్ కార్యకర్తలు నాయకులు అమీర్ బాషా,షేక్షావలి,నరసింహయ్య,కీర్తి చందర్,మహబూబ్ బాషా,సురేష్,అంబటి సుబ్బయ్య,పురుషోత్తం, భాను ప్రసాద్,నాగిరెడ్డి,పక్కీరమ్మ,శాంతిప్రియ,అస్మా బేగం,నస్రీన్,యాస్మీన్ తదితరులు పాల్గొన్నారు.

About Author