NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సంక్షేమ వసతి గృహాలు చక్కగా పనిచేయాలి

1 min read

విద్యార్థుల చదువు-ఆరోగ్యం పై శ్రద్ద పెట్టండి

100% ఉత్తీర్ణత సాధించాలి

సిబ్బంది ఉద్యోగం చేసే ప్రదేశం లో నివాసం ఉండాలి

ఎస్.సత్య నారాయణ, బి.సి.వెల్ఫేర్ ఎక్స్-అఫీషియో కార్యదర్శి

కర్నూలు , న్యూస్​ నేడు : సంక్షేమ వసతి గృహాలు చక్కగా పనిచేయాలి అని విద్యార్థుల చదువు , ఆరోగ్యం పై శ్రద్ద పెట్టాలని బి.సి.వెల్ఫేర్ శాఖ ఎక్స్-అఫీషియో కార్యదర్శి ఎస్.సత్య నారాయణ అధికారులను ఆదేశించారు.మంగళవారం ఉదయం సునయన ఆడిటోరియం లో అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు మరియు నంద్యాల జిల్లాల హెచ్‌డబ్ల్యూఓలు, ఏబీసీడబ్ల్యూఓలు, డీబీసీడబ్ల్యూఈఓలు మరియు ఎంజేపీఏపీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ ప్రిన్సిపాళ్ల  అవగాహనా కార్యక్రమాన్ని  బి.సి.వెల్ఫేర్ ఎక్స్-అఫీషియో కార్యదర్శి నిర్వహించారు.ఈ సందర్బంగా సెక్రటరీ మాట్లాడుతూ…సంక్షేమ వసతి గృహాలు  ముఖ్యమంత్రి ఆశించిన విధంగా  చక్కగా పనిచేయాలన్నారు. విద్యార్థుల చదువు, ఆరోగ్యం పై శ్రద్ద పెట్టాలని,  మెనూ ప్రకారం మంచి పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు.  స్టడీ అవర్స్ ను 100 రోజులు పూర్తిగా వినియోగించుకొని, వంద శాతం ఉత్తీర్ణత  సాధించే  విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.సమావేశంలో జాయింట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి , నాలుగు జిల్లాల బీసీ వెల్ఫేర్ అధికారులు ప్రసూన కర్నూలు , కుష్బూ కొఠారి అనంతపురం , జగ్గయ్య నంద్యాల , రాజేంద్ర కుమార్ రెడ్డి సత్యసాయి , మహాత్మ జ్యోతిబాపూలే సంక్షేమ వసతి గృహాల  ప్రిన్సిపాల్ లు , సహాయ బీసీ వెల్ఫేర్ అధికారులు  , వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.

About Author