NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీయూడబ్ల్యూజే యూనియన్ ని బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

1 min read

మంత్రాలయం న్యూస్ నేడు : మంత్రాలయం నియోజకవర్గంలో ఏపీయూడబ్ల్యూజే యూనియన్ ని  బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని  ఏపీయూడబ్ల్యూజే మంత్రాలయం నియోజకవర్గ అధ్యక్షులు వగరూరు జయరాజ్, జిల్లా ఉపాధ్యక్షులు చాంద్ బాషా, జిల్లా సహాయ కార్యదర్శి హనుమేష్ పిలుపునిచ్చారు.  మంగళవారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయంలోని రివేరా ఇన్ కల్యాణ మండపం లో ఏపీయుడబ్ల్యూజే గౌరవ అధ్యక్షులు వీరశేఖర్ శెట్టి , ప్రధాన కార్యదర్శి హుస్సేని , కోశాధికారి  సాబువలి, ఆర్గనైజింగ్ కార్యదర్శి సూర్యనారాయణ ఆచార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఏపీడబ్ల్యూజే నూతన మండల కమిటీ ఏర్పాటు కు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గంలో ఏపీయుడబ్ల్యూజే ను  బలోపేతం చేసేందుకు ప్రతి జర్నలిస్టు  కృషి చేయాలన్నారు. నియోజకవర్గంలోని జర్నలిస్టు ఇంటి స్థలాలు, ప్రెస్ క్లబ్, అక్రిడేషన్, హెల్త్ కార్డులు వంటి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.  ఫిబ్రవరి నెలలో  విజయవాడలో జరిగే 11వ ఐజేయు ప్లీనరీ సమావేశాన్ని అందరూ కలిసి విజయవంతం చేద్దాం అన్నారు.  ఏపియుడబ్య్లూజే నూతన మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక : –  ఏపియుడబ్య్లూజే నూతనంగా మంత్రాలయం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏపీయుడబ్ల్యుజే మండల గౌరవ అధ్యక్షులుగా కే రానోజిరావు, మండల అధ్యక్షులుగా మహమ్మద్ రఫీ, ప్రధాన కార్యదర్శిగా బూదురు నాగరాజు, కోశాధికారిగా రామస్వామి, ఆర్గనైజింగ్ కార్యదర్శి శివరాం, ఉపాధ్యక్షులుగా వెంకట్, ఈరన్న, మహబూబ్, సహాయ కార్యదర్శిలుగా భీమరాయ, ప్రకాష్ రెడ్డి కంతం నరసింహులు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం నూతన కమిటీ సభ్యులకు శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే తాలుకా ఉపాధ్యక్షులు గోవిందు , శ్రీ రాములు ,  కోసిగి మండల అధ్యక్షులు షబ్బీర్ కౌతాళం మండల అధ్యక్షులు అంజిని కార్యవర్గ సభ్యులు రవి, రామంజి, కప్పన్న, రఫీ తదితరులు పాల్గొన్నారు.

About Author