NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైద్య వృత్తి లో నైతికత ముఖ్యం..

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  వైద్య వృత్తి లో నైతికత ముఖ్యం.. అడిషనల్ డి.యం.ఇ లు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, హాస్పటల్ సూపరిండెంట్  డా.కె. చిట్టి నర్సమ్మ, డా వెంకటేశ్వర్లు … వైద్య వృత్తిలో నైతిక విలువలు ఎంతో ముఖ్యమని రోగి వైద్యుల వద్దకు ఆరోగ్య సమస్య పరిష్కారం కోసం వస్తారని  వైద్యం విషయం లో  మరియు  రోగి సమాచారం విషయాల్లో  నైతికత ముఖ్యమని ఏ.డి.యం.ఇ లు కర్నూల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, హాస్పటల్ సూపర్డెంట్ లు డా. కే. చిట్టి నరసమ్మ, డా. వెంకటేశ్వర్లు లు అన్నారు. వైద్యులు  తన కుటుంబ సభ్యులకు ఎంత జాగ్రత్తగా  వైద్యం చేస్తామో అది ప్రతి రోగి విషయంలో కూడా చూపాలని  రోగికి వైద్య సమాచారం  తెలపాలని  అన్నారు. మంగళవారం కర్నూలు వైద్య కళాశాలలో పీజీ,సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థులకు ఏం.సి.ఐ నిబంధనల మేరకు “గుడ్ క్లినికల్ & లేబరేటరీ ప్రాక్టీసెస్,ఎథిక్స్” గురించి  మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ వైద్య వృత్తిలో వైద్యులకు  ఏప్పటికైనా అండగా నిలిచేది వారి వైద్యం సంబంధించిన రికార్డు లేనని వైద్యానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు రికార్డు చేయాలని తెలిపారు. వైద్య వృత్తికి ఇప్పటికీ మంచి విలువ ఉందని అందులో సామాజిక స్పృహ ఉన్న వైద్యులకు  సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమము యం.ఏ.యు కో ఆర్డినేటర్,కమ్యూనిటీ మెడిషన్ విభాగాదిపతి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సింధియా శుభప్రద ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సాయి సుధీర్ ఫార్మకాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజేష్, కమ్యూనిటీ మెడిసిన్ సొసైటీ ప్రొఫెసర్ డాక్టర్ అరుణ, తదితరులు పాల్గొన్నారు.

About Author