పోస్టల్ ఖాతాదారులను చైతన్య పరచండి..
1 min read
పోస్టల్ ఇన్స్పెక్టర్ రామనాథ్
చాగలమర్రి రూరల్ న్యూస్ నేడు: పోస్టల్ ఖాతాదారులకు పోస్టల్ ప్రయోజనాలు ఖాతాదారులకు వివరించి చైతన్య పరచాలని ఆళ్లగడ్డ తాలూకా పోస్టల్ ఇన్స్పెక్టర్ రామనాథ్ అన్నారు. బుధవారం చాగలమర్రిలోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్మాస్టర్ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో పోస్టల్ సిబ్బంది సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పోస్టల్ ఇన్స్పెక్టర్ రామనాథ్ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో పోస్టల్ సిబ్బంది చేయవలసిన నిర్దిష్ట ప్రణాళికను వివరించారు. 10 సంవత్సరాల ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ప్రారంభించేందుకు తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. పొదుపు చేయడం వలన ప్రయోజనాలను వివరించాలన్నారు. తపాల జీవిత బీమా అందరికీ తెలిసే విధంగా చైతన్యం చేయాలన్నారు. 19 నుండి 55 సంవత్సరాల లోపు గ్రాడ్యుయేట్లకు, ఉద్యోగులకు, వివిధ ఖాతాదారులకు తపాల జీవిత బీమా ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయక్, భాస్కరరావు, పెద్దరాజు, 10 గ్రామాల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు, పోస్ట్ మ్యాన్ లు తదితరులు పాల్గొన్నారు.

