అంగన్వాడి కేంద్రంలో అన్నప్రాసన..
1 min read
17వ కేంద్రంలో అన్నప్రాసన నిర్వహిస్తున్న టీచర్ చంద్రకళ
చాగలమర్రి, న్యూస్ నేడు : ఆళ్లగడ్డ ప్రాజెక్ట్ సమగ్ర శిష్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సి బి ఈ, ఈవెంట్ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు బుధవారం మండలంలోని చాగలమర్రి 3,7 ,17 అంగన్వాడి కేంద్రాలతో పాటు బ్రాహ్మణ పల్లె, కదిరిపురం తండా, కదిరిపురం, చక్రవర్తుల పల్లె, ఓజీ తాండ, శెట్టి వీడు, చిన్న వంగలి, తిప్పనపల్లె, అంగన్వాడి కేంద్రాలలో కూడా అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీచర్లు మాట్లాడుతూ సంఘస్ఫూర్తిని పెంపొందించడం, సామాజిక సంబంధాలను పెంచడం కోసం కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలలో అంగన్వాడి టీచర్లు, అంగన్వాడి సహాయ కార్యకర్తలు, చిన్నారుల తల్లులు తదితరులు పాల్గొన్నారు.

