ఎస్సీ,ఎస్టీ ఫిర్యాదులు పరిష్కారంలో ఏలూరు జిల్లా ముందుంది
1 min read
ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడి ఋణాలను సద్వినియోగం చేసుకుని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి
ఆర్థికంగా బలోపేతం అయ్యేలా అధికారులు మరింత కృషి చెయ్యాలి
యస్సి,ఎస్టీ అట్రాసిటీ యాక్టు తమనుతాము రక్షించు కోవడానికే గాని, అమాయకులను శిక్షించుటకు కాదు
ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్ జోహార్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు : ఏ జిల్లాకు వెళ్ళినా ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, ఏలూరు జిల్లాలో ఫిర్యాదులు తక్కువగా వచ్చాయని ఎంతో సంతృప్తి కలిగిందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ని ఏపీ ఎస్సి కమిషన్ చైర్మన్ కె.యస్.జవహర్ అభినందించారు.జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లాలో వివిధ శాఖలు ద్వారా షెడ్యూల్డ్ కులాల వారికి అమలు చేస్తున్న సబ్సిడీ బ్యాంకు ఋణాలు, వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రగతిపై, గృహనిర్మాణం, పరిశ్రమలు విద్య, వైద్య ఆరోగ్యం, రోడ్లు భవనాలు, పోలీసు, సాంఘిక సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి, తదితర కార్యక్రమాలు శాఖలు వారీగా మండలాలు వారీగా ఏపి యస్సి కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్ సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమావేశానికి జిల్లాకలెక్టరు కె.వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, ఏపి ఎస్సీ కమిషన్ కార్యదర్శి చిన్న రాముడు, జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ, జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా షెడ్యుల్డ్ కులాల కమీషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్ళినా ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, ఎస్సీ,ఎస్టీ ఫిర్యాదులు పరిష్కారంలో ఏలూరు జిల్లా ముందు ఉందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి కి అభినందలు తెలుపు తున్నామని అన్నారు. జిల్లా ఎస్సీ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ,ఎస్టీ వర్గాలు నుండి పోలీసు స్టేషనులో ఎటువంటి ఫిర్యాదు వచ్చినను ముందుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, క్షేత్రస్థాయిలో ఒకటికి నాలుగు సార్లు పరిశీలన చేసి వారికి అన్ని విధాలుగా ఫ్రెండ్లీ పోలీసు సహకారం అందిస్తున్నామని అన్నారు. పోలీసు శాఖలో అన్ని రకాలు ఉద్యోగాలు కల్పనలో ఎస్సీ రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేస్తున్నామని అన్నారు. ఎస్సీ,ఎస్టీ గ్రామాలలో మత్తుపదార్థాలు, అక్రమ మద్యం, చెడు వ్యసనాలకు లోను కాకుండా యువత మంచిమార్గంలో నడిచేలా పోలీసు శాఖ తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ సమావేశంలో ఏపి ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టరు దాసరి ఆంజనేయులు, యస్సి కమిషన్ సభ్యులు రావాడ సీతారామ్, డా.పి.గౌతమ్, మేకల భిక్షం( దాసు), ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, ఆర్డీవోలు యం. అచ్యుత అంబరీష్, యం.వి. రమణ, జిల్లా వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

