మాచారెడ్డి మండల కేంద్రంలో ప్రజా బాట కార్యక్రమం
1 min read

కామారెడ్డి, న్యూస్ నేడు: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో, “ప్రజా బాట” కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాచారెడ్డి ( ఏ ఈ ) తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, బావుల వద్ద కెపాసిటర్లు తప్పనిసరిగా బిగించుకోవాలని అన్నారు. అదేవిధంగా విద్యుత్తు భద్రత విధానాలను తప్పక పాటించాలని అన్నారు. రైతులకు వినియోగదారులకు ఎలాంటి విద్యుత్తు సమస్యలు వచ్చిన, మా యొక్క సిబ్బందికి తెలియజేయాలని, తమ సొంత నిర్ణయాలతో రైతులు గాని, వినియోగదారులు గాని, విద్యుత్ మరమ్మతులు చేయరాదని అన్నారు. మా యొక్క సిబ్బందికి సమస్య ఉంటే వెంటనే తెలియజేస్తే సమస్యను పరిష్కరిస్తారని ఈ సందర్భంగా రైతులకు విజ్ఞప్తి చేశారు.. లైన్మెన్ యూనుస్ మాట్లాడుతూ, రైతులకు వినియోగదారులకు సేవలు అందించడానికి 24 గంటలు నిరంతరంగా పనిచేస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో, లైన్ ఇన్స్పెక్టర్, లైన్మెన్లు, ఏఎల్ఎంలు, రైతులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


