NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రతి ఒక్కరూ బాలికల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి

1 min read

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లీగల్ సర్వీస్ యూనిట్ మెంబర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్.

కర్నూలు, న్యూస్​ నేడు: జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్.ఏ.పీ క్యాంప్ ఆవరణలో ఉన్న కట్టమంచి రామ లింగారెడ్డి మెమోరియల్ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, లయన్స్ క్లబ్  అఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ల సంయుక్త ఆధ్వర్యంలో బాలికల హక్కులు -చట్టాలు అంశంపై  జరిగిన అవగాహన కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారక సంస్థ లీగల్ సర్వీస్ యూనిట్ ఫర్ చిల్డ్రన్ మెంబర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి బాలికకు నాణ్యమైన విద్యతో పాటు సామాజిక భద్రతను అందించాల్సిన బాధ్యత మన అందరిదీ అని, బాలికలపై వివక్ష, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మించాల్సిన అవసరం మన అందరి పైన ఉందన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం బాలికల సంక్షేమానికి బేటి బచావో బేటి పడావో లాంటి ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నదని బాలికారుల ఆరోగ్య పరిరక్షణ మన అందరి బాధ్యత అన్నారు. అనంతరం బాల్యవివాహల నివారణపై  ప్రతిజ్ఞ చేయించారు. బాలికల హక్కులు -చట్టాలు అంశంపై జరిగిన వ్యాసరచన పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, నైస్ స్వచ్ఛంద సేవా  సంస్థ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author