NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈనెల 30 వరకు కోర్టు విధుల బహిష్కరణలో న్యాయవాదులు

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు:   కోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా నిందితున్ని బలవంతంగా అరెస్టు చేసి న్యాయవ్యవస్థనే అవమానించిన ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ, తలపెట్టిన నిరసన ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని పత్తికొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మధుబాబు, సీనియర్ న్యాయవాదులు కారన్న,  ఎల్లారెడ్డి, సురేష్, సత్యనారాయణ తెలిపారు. శనివారం పత్తికొండ బార్ అసోసియేషన్ కార్యాలయంలో న్యాయవాదు లు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత సంవత్సరం డిసెంబర్ 24వ తేదీన పత్తికొండ కోర్టులో లొంగిపోయేందుకు వచ్చిన ముద్దాయి శివన్నను చిప్పగిరి, పత్తికొండ ఎస్సైలు సతీష్ కుమార్, విజయ్ కుమార్ లాక్కుని వెళ్లడంతో పాటు న్యాయవాదిని దురుసుగా ప్రవర్తించడంతో అన్ని బార్ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో నిరసన, ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఆ ఎస్ఐలపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకునేంతవరకు ఈ నెల 30 వరకు కోర్టు విధులను  బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్, జూనియర్ న్యాయవాదులు తుగ్గలి శ్రీనివాసరెడ్డి, మల్లికార్జున, కృష్ణయ్య, రంగస్వామి, నారాయణ స్వామి,  నాగేష్, నరసింహచారి, మహేష్, నరసింహులు, దామోదరాచారి, రంగన్న,  శ్రీకాంత్ రెడ్డి,  నెట్టేకల్లు, నాగభూషణం రెడ్డి, రవి, సూరాజ్ నబి, పంపాపతి, జటంగిరాజు, శ్రీనివాసరెడ్డి, నర్సారావు, మునయ్య, సుధాకృష్ణ, వీరస్వామి,  వాసుదేవ,  రాజశేఖర్, మధు, సాంబ, నాగరాజు, రాజాక్, వీరేష్ పాల్గొన్నారు.

About Author