NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డా బిషప్ జయరావు పొలిమేర డిడి ప్రజా సేవలు అభినందనీయం

1 min read

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు రోమన్ కతోలిక పీఠాధిపతి మహా ఘనత వహించిన బిషప్ డా:జయరావు పొలిమేర ని ఏలూరులోని బిషప్ హౌస్ లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా బిషప్ హౌస్ కు విచ్చేసిన దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ ని ఏలూరు పీఠాధిపతి  మరియు పలువురు గురువులు సత్కరించారు.బిషప్ జయరావ్ పొలిమేర  ఆధ్వర్యంలో ఏలూరు రోమన్ కతోలిక పీఠం ఆధ్వర్యంలో చేస్తున్న ప్రజా సేవలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్  అభినందించారు.ఈ కార్యక్రమంలో ఫాదర్: బేదంపూడి రాజు,ఫాదర్ పి.బాల, ఫాదర్: ఐ మైఖేల్,ఫాదర్ స్టీవెన్ స్టీవెన్ సహ పలువురు గురువులు పాల్గొన్నారు.

About Author