యూట్యూబర్ ను చితకబాదిన షాప్ యజమాని !
1 min read
పల్లెవెలుగు వెబ్: హైదరాబాద్ లో ఓ యూట్యూబర్ ను షాప్ యజమాని చితకబాదారు. ప్రాంక్ వీడియో పై హైదరాబాద్ లోని అబిడ్స్ జగదీష్ మార్కెట్ లోని ఓ మొబైల్ షాప్ లో గొడవ జరిగింది. ‘ హైదరాబాదీ ప్రాంక్స్’యూట్యూబ్ చానల్ యాంకర్ ప్రాంక్ వీడియోలో భాగంగా షాప్ యజమానితో గొడవకు దిగాడు. గొడవ పెద్దది కావడంతో యాంకర్ ను షాప్ ఓనర్ చితకబాదాడు. అప్పటికే ఆవేశానికి లోనైన షాప్ యజమాని యాంకర్ ను మరింత కసిగా కొట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.