వాసవి క్లబ్ నూతన కార్యవర్గం విస్కృత స్తాయి సమావేశం
1 min read

వెలుగోడు మేజర్ న్యూస్ : నంద్యాల పట్టణం శ్రీనివాసనగర్ నందు గల బాలాజీ కళ్యాణ మండపం లో వెలుగోడు వాసవి క్లబ్ నూతన కార్యవర్గం ఆదివారం విస్కృత స్థాయి సమావేశంలో పాల్గొని క్లబ్బు యొక్క దిశా నిర్దేశాలపై కార్యక్రమాన్ని గవర్నర్ లింగం నాగ శైలజ అధ్యక్షతన కోఆర్డినేటర్ బాదం నాగేంద్ర జోన్ చైర్మన్ తాళ్లూరి సంజీవరాయ ప్రసాద్ నిర్వహించడం జరిగింది తదనంతరము వారు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు చేపట్టి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ప్రోగ్రామ్స్ క్యాలెండర్ ప్రకారం ప్రోగ్రామ్స్ చేయాలని తెలిపారు. వెలుగోడు వాసవి క్లబ్ నూతన కార్యవర్గం ప్రెసిడెంట్ బలుసా రాము, సెక్రెటరీ తాళ్లూరి నాగరాజు, ట్రెజరర్ నాగేల్ల చంద్రశేఖర్, వీరితోపాటు వనిత స్ఫూర్తి క్లబ్ ప్రెసిడెంట్ తాళ్లూరి విజయలక్ష్మి సెక్రటరీ తల్లం అనురాధ ట్రెజరర్ సునీత వీరందరూ కార్యక్రమంలో పాల్గొని ప్రమాణ స్వీకారం చేశారు వీరందరికీ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు అభినందనలు తెలియజేశారు.

