NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వివిధ రకాల పంటల క్రాప్ స్టేజి గురించి రైతులకు అవగాహన

1 min read

అవగాహన కల్పించిన డిఏఓ..ఆత్మా పిడి

రైతులతో శాస్త్రవేత్తలు ముఖాముఖి..

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  వివిధ రకాల పంటల క్రాప్ స్టేజి గురించి రైతులకు అవగాహన కల్పించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో వ్యవసాయ ల్యాబ్ లో మంగళవారం వ్యవసాయ సాంకేతిక కర్నూలు జిల్లా యాజమాన్య సంస్థ (ఆత్మా) ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలతో రైతుల ముఖాముఖి నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి షేక్షావలి తెలిపారు.నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ వెంకటేశ్వర్లు,ఆత్మా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీలత ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త సుజాత హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడుతూ రైతులకు సంబంధించిన ప్రత్యేక గుర్తింపు సంఖ్య రిజిస్ట్రేషన్ గురించి వివరించారు.ఈ పంట నమోదు చేసుకోవడానికి ఏపీ ఎయిమ్స్ క్రాబ్ బుకింగ్ యాప్ గురించి మరియువివిధ రకాల పంటల క్రాప్ స్టేజి గురించి పంటల యాజమాన్యం గురించికిసాన్ డ్రోన్స్ గురించి రైతులకు తెలియజేశారు. వ్యవసాయ అధికారుల సలహాల మేరకు పంటలకు సరైన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే పంట అధిక దిగుబడి వస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో నందికొట్కూరు వ్యవసాయ సహాయ సంచాలకులు గిరీష్, నాలుగు మండలాల వ్యవసాయ అధికారులు,టెక్నికల్ ఏవో మరియు రైతులు పాల్గొన్నారు.

About Author