NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టిడిపి జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో హొళగుంద నాయకులు

1 min read

పసుపు ప్రభంజనమై వెల్లివిరిసిన కర్నూలు

పసుపు తొరణాలతో ప్రజ్వరిల్లిన సభా ప్రాంగణం

హోళగుందన్యూస్ నేడు: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి యువగళం అధినేత శ్రీ నారా లోకేష్ ల ఆదేశాలతో,  టిడిపి రాష్ట్ర కమిటీ మార్గనిర్దేశం మేరకు నూతనంగా ఎన్నుకోబడిన కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యవర్గ ప్రతినిధుల ప్రమాణ స్వీకారోత్సవం జిల్లా కేంద్రంలోని యం.ఆర్.సి హాల్ నందు గురువారం నాడు అంగరంగా వైభవంగా జరిగింది. కాగా ఆలూరు టిడిపి ఇంచార్జివర్యులు శ్రీమతి వైకుంఠం జ్యోతి  ఆదేశాల మేరకు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన తెలుగు యువత మాజీ రాష్ట్ర కార్యదర్శి చిన్నహ్యట శేషగిరి, జిల్లా జడ్పిటిసిల సంఘం మాజీ అధ్యక్షులు చిప్పగిరి మీనాక్షి నాయుడు, హొళగుంద మండల సింగల్ విండో చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, మండల కన్వీనర్ తుంబళం తిప్పయ్య, మండల కార్యదర్శి రైస్ మిల్ మురళీధర్, మాజీ కన్వీనర్ కోనేరు దుర్గయ్య తదితరులు బృందం  కర్నూలు జిల్లా చరిత్రలోనే మొట్టమొదటి సారిగా జిల్లా అధ్యక్షురాలిగా పదవి బాధ్యతలను చేపట్టిన బీసీ ముద్దుబిడ్డ, కార్య దక్షిత నిష్పక్ష నాయకత్వానికి ప్రతిరూపమైన  శ్రీమతి గుడిసె కృష్ణమ్మ కి పుష్పగుచ్చాన్ని అందించి, ఘనంగా సన్మానించడం ద్వారా ప్రత్యేక శుభాకాంక్షలను తెలిపారు.నాయకులు మాట్లాడుతూ నూతన టిడిపి జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ  తెలుగుదేశం పార్టీకి అత్యంత విధేయత కలిగిన నాయకురాలిగా, ఎంతటి కష్టాలు ఎదురైనా కూడా పార్టీని అంటపెట్టుకొని, కార్యకర్తలకు మాతృమూర్తిగా నిలిచిన వారి ధైర్యం, నిరాపేక్షత మరియు నిష్పక్షపాత పాలనా ప్రతిభ తెలుగుదేశం పార్టీ జిల్లా నాయక వర్గానికి స్ఫూర్తిదాయకమన్నారు.ఎల్లవేళలా ఎటువంటి ప్రలోభాలు ఒత్తిళ్లకు తలొగ్గకుండా తెలుగుదేశం పార్టీలో అధిష్టాన ఆదేశాలే అంతిమ శానంగా  శిరసావహిస్తూ, నమ్ముకున్న కార్యకర్తలకు కంటికి రెప్పయి కాపాడుకుంటున్న  గుడిసె ఆదికృష్ణమ్మ కష్టాలకు తగిన ప్రతిఫలం నేడు టిడిపి జిల్లా అధ్యక్షురాలి రూపంలో నిరూపితమైందన్నారు.తదనంతరం నూతనంగా ఎన్నోకోబడ్డ ఉపాధ్యాక్షులు, కార్యదర్శులు మరియు కార్యవర్గ సభ్యులను కూడా ప్రత్యేకంగా సన్మానించి పదవి స్వీకారోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ టౌన్ ప్రెసిడెంట్ కురువ మల్లికార్జున, ఎస్టీ నాయకులు ఎరుకుల తిప్పేష్,వాల్మీకి భీమేష్,యువ నాయకులు ఎల్లార్తి చిదానంద, మార్లమడికి యస్.యం.సి చైర్మన్ భాస్కర్, గోవిందు, గంగన్న, ఐ.టిడిపి  నాగేంద్ర, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

About Author