తెలుగు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ
1 min read

హోళగుందన్యూస్ నేడు: ఎస్డీపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎన్. సుభాన్ సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపిఐ) ఆధ్వర్యంలో నేడు తెలుగు దినపత్రిక క్యాలెండర్‌ను పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్. సుబన్ ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు, తెలుగు దినపత్రిక ప్రజా సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తీసుకువస్తూ సమాజంలో చైతన్యం కలిగించడంలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి నిజాయితీగల జర్నలిజం ఎంతో అవసరమని పేర్కొన్నారు.అలాగే తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణలో మీడియా పాత్ర మరింత బలపడాలని, ప్రజల హక్కుల కోసం పత్రికలు నిలబడాలని ఎన్. సుబన్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎస్డీపిఐ నాయకులు, కార్యకర్తలు, తెలుగు దినపత్రిక ప్రతినిధులు పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలూరు అసెంబ్లీ అధ్యక్షుడు ఎఫ్, అబ్దుల్ హమీద్, ప్రధాన కార్యదర్శి కే ,అబ్దుల్ రెహ్మాన్, కార్యదర్శి ఎం , హఫీజ్, ఎం ,రహమతుల్లా, బి , అల్లా బకాష్, తదితరులు పాల్గొన్నారు.

