ఆది కృష్ణమ్మ నాయకత్వంలో జిల్లాలో టిడిపి మరింత బలోపేతం అవుతుంది
1 min read

హోళగుందన్యూస్ నేడు: కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షురాలిగా వాల్మీకి ముద్దుబిడ్డ శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ నేడు బాధ్యతలు స్వీకరించారు. స్థానిక ఎం.ఆర్.సి కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం వేలాది మంది కార్యకర్తలు, నాయకుల సమక్షంలో కోలాహలంగా జరిగింది.ఆది కృష్ణమ్మ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో, ఈ కార్యక్రమానికి వాల్మీకి సంఘాల నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా హోళగుంద మండలం, గజ్జహళ్ళి గ్రామానికి చెందిన వాల్మీకి సంఘం నాయకులు, కార్యకర్తలు తండోపతండాలుగా తరలివచ్చి తమ ఆత్మీయ నేతకు ఘన స్వాగతం పలికారు. “వాల్మీకుల ఐక్యత వర్ధిల్లాలి” అంటూ నినాదాలు చేస్తూ ప్రమాణ స్వీకార ప్రాంగణాన్ని హోరెత్తించారు.ఈ సందర్భంగా గజ్జహళ్ళి వాల్మీకి నేతలు మాట్లాడుతూ.. వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన మహిళకు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆది కృష్ణమ్మ నాయకత్వంలో జిల్లాలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని, వాల్మీకి బిడ్డగా ఆమెకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు.పార్టీ అగ్రనేతల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న టీడీపీ ప్రముఖులు పాల్గొని ఆది కృష్ణమ్మ ని శాలువాలతో ఘనంగా సన్మానించారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన పార్టీ అధిష్టానానికి, తనకు అండగా నిలిచిన వాల్మీకి సోదరులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు శివలింగ, రాము, వెంకటేష్, గోవిందు, శేఖర్, భీమేష్, కే రాము, నరసింహ, ఎర్రి స్వామి తప్ప వీరేష్ నాగరాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు.


