NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సకుటుంబ సమేతంగా కనులవిందు

1 min read

గుంటూరు, విజయవాడ పార్లమెంటు సెగ్మెంట్ల ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు

వారి కుటుంబసభ్యులతో మంత్రి నారా లోకేష్ ఆత్మీయ సమావేశం

అమరావతి , న్యూస్ నేడు :  ప్రజాప్రతినిధులంతా సకుటుంబంగా తరలిరావడంతో మధ్యాహ్నం వేళ ఆత్మీయ కలయిక కనుల`విందు`గా జరిగింది. ఉండవల్లి నివాసంలో శనివారం మధ్యాహ్నం గుంటూరు, విజ‌య‌వాడ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, వారి కుటుంబ‌స‌భ్యుల‌తో మంత్రి నారా లోకేష్‌ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కుటుంబసభ్యులను స్వాగతించిన లోకేష్, వారితో ఆత్మీయంగా మాట్లాడారు. చిన్నపిల్లలతో కబుర్లు చెబుతూ సరదాగా గడిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, రాజకీయాలకు దూరంగా కుటుంబ విషయాలు, బాగోగులు, విద్య, క్రీడల గురించిన అర్థవంతమైన చర్చలు సాగాయి. చదువు, కెరీర్ ఒక్కటే జీవితం అని అందరూ భావిస్తున్నారని, స్పోర్ట్స్ కూడా కెరీర్ గా పిల్లలు ఎంచుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని లోకేష్ సూచించారు. అంతా కలిసి ఒకేచోట భోజనం చేస్తూ, మాట్లాడుకున్నారు. మొత్తం నాయకులంతా తమ కుటుంబాలతో తరలి రాగా ఆహ్లాదకరమైన వాతావరణంలో వనభోజనాల్లా కనుల`విందు`గా సాగింది. లీడర్లు తనకు ఇచ్చిన వినతుల లేటెస్ట్ స్టేటస్ రిపోర్టులను లోకేష్ స్వయంగా వారికి అందజేశారు. తన నియోజకవర్గమైన మంగళగిరి చేనేతను ప్రమోట్ చేయడంలో ఏ ఒక్క అవకాశాన్నీ వదలని మంత్రి నారా లోకేష్.. ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులకు మంగళగిరి చేనేత చీరలు కానుకగా అందించారు. ఈ ఆత్మీయ కలయికకు గుంటూరు ఎంపీ -కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖ‌ర్ ,  పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ (తెనాలి-జ‌న‌సేన‌), ఎమ్మెల్యేలు తెనాలి శ్రావ‌ణ్ కుమార్ (తాడికొండ‌), ధూళిపాళ్ల న‌రేంద్రకుమార్ (పొన్నూరు), బూర్ల రామాంజ‌నేయులు (ప్రత్తిపాడు), గ‌ల్లా మాధ‌వి (గుంటూరు వెస్ట్‌), నసీర్ అహ్మద్ (గుంటూరు ఈస్ట్‌), ఆల‌పాటి రాజేంద్రప్రసాద్ (ఎమ్మెల్సీ), విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని), ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య (నందిగామ‌), శ్రీరాం రాజ‌గోపాల్ (జ‌గ్గయ్యపేట‌), వ‌సంత వెంక‌ట కృష్ణప్రసాద్ (మైలవ‌రం), కొలిక‌పూడి శ్రీనివాస‌రావు (తిరువూరు), బొండా ఉమామ‌హేశ్వర‌రావు (విజ‌య‌వాడ సెంట్రల్) , గ‌ద్దె రామమోహ‌న రావు (విజ‌య‌వాడ ఈస్ట్‌), పంచుమ‌ర్తి అనురాధ (ఎమ్మెల్సీ)  కుటుంబ‌స‌భ్యుల‌తో హాజ‌ర‌య్యారు.

About Author