సేవా కార్యక్రమాల వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: పేద మరియు అనాధ పిల్లల సంక్షేమానికి అందరూ ముందుకు రావాలని సేవ చేయడమే నిజమైన మానవత్వం అని నేడు అన్నపూర్ణ బాలురవాసంతిగృహము నందు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో వక్తలు పిలుపునిచ్చారు.విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు,లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ గౌరవాధ్యక్షులు రిటైర్డ్ యం. ఆర్. ఓ మురారి శంకరప్ప మాట్లాడుతూ పిల్లల పట్ల ఆప్యాయతతో పాటు అవసరమైన సహాయం అందించడం మనందరి బాధ్యత అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లీగల్ సర్వీస్ యూనిట్ మెంబర్ ,జిల్లా చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్పెక్షన్ కమిటీ మెంబర్ లయన్స్ జిల్లా అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీ, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయని, చిన్నారుల భవిష్యత్తుకై మనమందరం సహాయ సహకారాలు అందించాలన్నారు .ఈ సేవా కార్యక్రమంలో వసతి గృహ కార్యనిర్వాహాక అధ్యక్షులు చిరంజీవిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలనుండి వచ్చే పేద బాలురకు అన్నిరకాల సౌకర్యాలను కల్పిస్తూ వారివిద్యభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నమన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డీస్పీ పాపారావు,చూడమణి, రవళి, వసతిగృహ ఇంచార్జి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

