హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నిందితుడు అయిన బోయ గిడ్డయ్య @ సంతెన్న కు జీవిత ఖైదు శిక్ష విధించినట్లు కర్నూలు ఒకటవ అదనపు జిల్లా & సెషన్స్ న్యాయమూర్తి పి. కమల దేవితెలియజేశారు.ఉలిందకొండ పి.ఎస్. క్రైమ్ నెం. 76/2016, సెక్షన్లు 302, 201, 379 r/w 109 ఐపీసీ ప్రకారం నమోదు చేయబడిన కేసులో, ఫిర్యాదుదారుడు ముల్లా ముర్తుజావలి, వయసు 40 సంవత్సరాలు, ఉలిందకొండ గ్రామం, కల్లూరు మండలం, కర్నూలు జిల్లా .గూడూరు గ్రామానికి చెందిన 8 సంవత్సరాల బాలిక హత్యకు గురైన ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ కేసులో నిందితులు:బోయ గిడ్డయ్య @ సంతెన్న, వయసు 60 సంవత్సరాలు, ఎర్రకత్వ గ్రామం, కల్లూరు మండలం, కర్నూలు జిల్లా.బోయ తలారి రంగడు, వయసు 35 సంవత్సరాలు, గూడూరు గ్రామం & మండలం, కర్నూలు జిల్లా.దర్యాప్తు పూర్తిచేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయగా, కేసు విచారణ చేపట్టారు .ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి, నిందితుడికి శిక్ష పడేలా అప్పటి కర్నూలు రూరల్ సి.ఐ నాగరాజు యాదవ్ కృషి చేశారుముద్దాయికి శిక్ష పడుటకు కృషి చేసిన కర్నూలు రూరల్ సి.ఐ ఎం.చంద్రబాబు నాయుడు, ఉలిందకొండ S.I ధనుంజయ , కోర్టు కానిస్టేబుల్ లను కర్నూల్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ అభినందించారు.

