NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కమ్యూనిటీ హాల్ నిర్మించండి

1 min read

ఎస్సీ కాలనీవాసులు వినతి

మంత్రాలయం న్యూస్ నేడు : మండల పరిధిలోని చిలకలడోన గ్రామంలో ఎస్సీ కాలనీ లో భూ ఆక్రమణ గురైన స్థలాన్ని పరిశీలించి స్వాధీనం చేసుకుని కమ్యనిటి హాలు నిర్మించాలని మంత్రాలయం తాసిల్దార్ రమాదేవి ని ఎస్సి కాలనీ వాసులు కోరారు. గురువారం మండల పరిధిలోని చిలకలడోన గ్రామంలో ఎస్సీ కాలనీ లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైన విషయంపై కొన్ని రోజుల క్రితం చిలకలడోన గ్రామ ఎస్సీ కాలనీ వాసులు కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ చేరుకొని గ్రామంలోనీ 4.ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని ఆ భూమిని వెంటనే సర్వే చేయించి నిరుపేదలైన పేదలకు పంచి ఇవ్వాలని అలాగే కమ్యూనిటీ హాల్ ను నిర్మించి ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. దీనికి స్పందిస్తూ మంత్రాలయం తాసిల్దార్ రమాదేవి తన బృందంతో చిలకలడోన గ్రామానికి చేరుకొని అక్కడ స్థలాన్ని పరిశీలిస్తుండగా ఆ కాలనీ వాసులు కొందరు పడగ స్పందిస్తూ ప్రభుత్వ భూమిని సర్వే చేయించి అందరికీ తగు న్యాయం చేస్తామని వారు తెలిపారు.అంతలోనే కొంతమంది వ్యక్తులు వారిలో వారే గొడవ పడుతూ ఉదృత వాతావరణం నెలకొల్పారు. చిలకలడోన గ్రామంలోని ఒక  నాయకుడు ఎస్సీ కాలనీ వాసులకు వారిలో వారికి చిచ్చు పెట్టడం వలనే ఈ ఉదృత వాతావరణం నెలకొందని ఎస్సీ కాలనీవాసులు చర్చించుకుంటున్నారు గుండు పోగులు నేపాల్ , రంగన్న,లు మాట్లాడుతూ ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చిలకల డోన గ్రామంలో ఎలాంటి ఉద్ధృత వాతావరణం చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిని వెంటనే సర్వే చేయించి తగు న్యాయం చేయాలని ఎస్సీ కాలనీవాసులు కోరుకుంటున్నానీ అన్నారు.

About Author