ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడిన వారినీ పరామర్శించిన ఎమ్మెల్యే
1 min read

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం పుట్టుకలమర్రి గ్రామ సమీపంలో వ్యవసాయ కూలీకి వెళ్తున్న బోలార వాహనం బోల్తా పడి 46 మంది గాయపడ్డరని ఈ విషయం తెలుసుకున్న ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి హుటాహుటిన ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించి డాక్టర్లతో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరడం జరిగింది.అదేవిధంగా ఇంకా మెరుగైన వైద్యం కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలని డాక్టర్లకు చెప్పడం జరిగింది… అక్కడ కర్నూలు లో ఉన్న డాక్టర్ గారితో ఫోన్ ద్వారా మాట్లాడి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ కి చెప్పడం జరిగింది.ఈ కూటమి ప్రబుత్వం వచ్చిన తర్వాత గ్రామంలో ఉపాధి లేకపోవడం వల్లన పక్క గ్రామాలకు కూలి వెళ్తున్నా సందర్భంగా ఇలా ప్రమాదం జరగడం చాలా బాధాకరం.ఆలూరు నియోజకవర్గంలో చాలా గ్రామల ప్రజలు గ్రామంలో ఉపాధి లేక వలస పోతున్నారు అని అన్నారు. గాయపడిన వారికి వైస్సార్సీపీ పార్టీ మరియు నేను అండగా ఉంటానని అని భరోసా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్ అభిమానులు పాల్గొన్నారు.


