NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చందానగర్ విధా స్కూల్ అన్యువల్ డే వేడుకలు

1 min read

 హైదరాబాద్​ : హైదరాబాద్ నగరంలోని చందానగర్ ప్రాంతానికి చెందిన విధా స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షికోత్సవ (అన్యువల్ డే) కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలు BHEL కమ్యూనిటీ సెంటర్ వేదికగా ఉత్సాహభరితంగా సాగాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, ఆటపాటలు, సంగీత కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారులు తమ ప్రతిభను చాటుతూ చేసిన రంగస్థల ప్రదర్శనలు సభికుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ప్రత్యేకంగా చిన్నారుల నృత్యాలు, సమూహ గీతాలు, థీమ్ ఆధారిత ప్రదర్శనలు అందరి మనసులు దోచుకున్నాయి.  ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, విద్యార్థుల్లోని అంతర్లీన ప్రతిభను వెలికితీయడమే విధా స్కూల్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యతో పాటు విలువలు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని అలవరచడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని చెప్పారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడతాయని పేర్కొంటూ విద్యార్థులను ప్రోత్సహించారు.

About Author