ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయం
1 min read
ఏపీజేఏసీ సీ కర్నూలు జిల్లా చైర్మన్ జవహర్ లాల్
కర్నూలు, న్యూస్ నేడు :కర్నూలు నగరంలోని ఏపీ ఎన్టీజీవో సంఘ కార్యాలయంలో ఆదివారం జేఏసీ భాగస్వామ్య సంఘాలన్నీ కలిసి కర్నూలు జిల్లా ఏపీ జేఏసీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లాలోని వివిధ ఉద్యోగ సంఘాల అధ్య క్షులు, కార్యదర్శులు, ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో సంఘ ఐక్యత, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవం..
కర్నూలు జిల్లా జేఏసీ చైర్మన్ గా జవహర్ లాల్ (ఏపీ ఎన్జీజీవో కర్నూలు జిల్లా అధ్య క్షుడు) ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, జేఏసీ కార్యదర్శిగా ఇస్మాయిల్ (ఏపీటీఎఫ్-1938 జిల్లా అధ్యక్షుడు) ఎంపికయ్యారు. కో-చైర్మన్లు గా ఇస్మాయిల్ (ఆర్టీసీ ఎన ఎంయు ), సుంకన్న (ఎస్టీయూ ), యం.సి.కాశన్న ( ఏపీ ఎన్జీజీవో జిల్లా కార్యదర్శి), వెంకటేశ్వర్లు ( వెటర్ నరి), వైస్ చైర్మన్ లుగా కృష్ణారెడ్డి, లింగన్న, చాంద్‌బాషా, నాగకిషోర్, మధుసూధన్ రెడ్డి, నవీన్ పాటిల్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సాంబశివ రెడ్డి, కోశాధికారిగా భాస్కర్ నాయుడు, జాయింట్ సెక్రటరీలుగా వివిధ సంఘాలకు చెందిన వారు 10 మంది, ఈసీ మెంబర్లుగా వివిధ సంఘాలకు చెందిన వారు15 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ జవహర్ లాల్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన, ఉద్యోగుల సంక్షేమ పరిరక్షణ కోసం జిల్లా స్థాయిలో అన్ని భాగస్వామ్య ఉద్యోగ సంఘాల నుంచి కార్యవర్గ సభ్యులతో సమన్వయంతో కూడిన బలమైన జేఏసీ ఏర్పడిందని తెలిపారు. వివిధ సంఘాలకు చెందిన నాయకులు *నూతనంగా ఎన్నికైన జేఏసీ కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.


