NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ హెచ్​పివి’ తో మహిళల ఆరోగ్యం సురక్షితం..

1 min read

పోషకాహార లోపంతో.. బాలికల అవస్థలు

  • చిన్న వయస్సులోనే  అబార్షన్లు తగదు…
  • 16 ఏళ్లలోపు సోషల్​ మీడియా బ్యాండ్​ నిర్ణయం… హర్షణీయం
  • ప్రముఖ కిడ్నీ వైద్య నిపుణురాలు డా. సాయి వాణి

 కర్నూల హాస్పిటల్​ , న్యూస్​ నేడు : మహిళల్లో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్​ తోపాటు,  నివారించదగ్గిన మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం హెచ్​పివి వ్యాక్సినేషన్​  ప్రారంభించడం అభినందనీయమని… దీన్ని 14 ఏళ్ల బాలికల నుంచి మహిళలందరూ  వేసుకోవాలని ప్రముఖ కిడ్నీ వైద్య నిపుణురాలు డా. సాయి వాణి అన్నారు. కర్నూలు నగరం ఏ క్యాంపులోని హార్ట్​ ఫౌండేషన్​ ఛాంబరులో ఆదివారం ‘ ఉమెన్​ అండ్​ హెల్త్​ ’ కార్యక్రమం పై సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన కిడ్నీ వైద్య నిపుణరాలు డా. సాయి వాణి మహిళల ఆరోగ్యంపై వివరించారు.   సమాజంలో చాలా మంది మహిళలు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్​ , రొమ్ము, కిడ్నీ క్యాన్సర్​ తదితర క్యాన్సర్​ వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, క్యాన్సర్​ లక్షణాలు తెలుసుకునేందుకు ముందుగా స్క్కీనింగ్​ పరీక్ష చేయించుకోవాలని సూచించారు.  ఆరోగ్య కరమైన జీవన శైలి, సమతుల్య ఆహారం, వ్యాయామం ద్వారా క్యాన్సర్​ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

విద్యార్థులకు… ‘ హెచ్​పివి..’

 బచ్చు జానకి రాం ఫౌండేషన్​  ఆధ్వర్యంలో నగరంలోని ఐదు స్కూళ్లలో విద్యార్థినీవిద్యార్థులకు హెచ్​పివి వ్యాక్సినేషన్​ ఇచ్చామని, విడుతల వారీగా వారికి ఇంజెక్షన్​ ఇవ్వడంతో భవిష్యత్​ లో క్యాన్సర్​ వ్యాధి బారిన పడే అవకాశం ఉండదని డా. సాయి వాణి స్పష్టం చేశారు.  అలాగే మున్సిపల్​ పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు కూడా ఇటీవల హెచ్​పివి వ్యాక్షినేషన్​ ను ఉచితంగా వేసినట్లు ఆమె పేర్కొన్నారు.

బాలికల్లో… ఊబకాయం..

ప్రస్తుత సమాజంలో ఫాస్ట్​ ఫుడ్​కు అలవాటు పడటం, పరిమితి లేకుండా ఆహారం భుజించడం వల్ల .. బాలికలు ఊబకాయంతో అవస్థలు పడుతున్నారని డా. సాయివాణి ఆందోళన వ్యక్తం చేశారు.  ఆడపిల్ల  పుడుతుందని … అబార్షన్లు చేయిస్తున్నారని, దీని వల్ల సదరు బాలిక ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు.  ఐరన్​, విటమిన్​ లోపంతో జీవితాంతం ఆరోగ్య సమస్యలతో సతమతమవుతుందన్నారు.

‘ సోషల్​’ బ్యాండ్​… హర్షణీయం

16 ఏళ్లలోపే పిల్లలు సోషల్​ మీడియా వేదిక ద్వారా ప్రేమించుకుంటున్నారని, ఇది వారి భవిష్యత్​ ను నాశనం చేస్తుందని తెలుసుకోలేకపోతున్నారు.  చిన్న వయస్సులోనే గర్భం దాల్చడం… అబార్షన్​ చేయించుకోవడం… ఆత్మహత్యలకు పాల్పడటం వంటివి సోషల్​ మీడియా వాడకంతో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్​ మీడియాను బ్యాండ్​ చేయడంపై తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు.

డా. సాయివాణిక ఘన సన్మానం

మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు తదితర అంశాలపై క్షుణ్ణంగా వివరించిన ప్రముఖ కిడ్నీ వైద్య నిపుణురాలు డా. సాయి వాణిని కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ సభ్యులు ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి .. పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ క్యాన్సర్​ వైద్య నిపుణులు డా. రవీంద్ర బాబు, హార్ట్​ ఫౌండేషన్​  గౌరవాధ్యక్షుడు చంద్ర శేఖర్​ కల్కూర, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

About Author