రైతులు అభివృద్ధి, సంక్షేమానికి, సహకార రంగాలను మరింత బలోపేతం చేస్తాము
1 min read

ప్రతీ రైతుకు గిట్టుబాటు ధర అందిస్తాం
డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ (చిన్న)
ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించి,ఆరోగ్య సమాజం ను తీర్చిదిద్దే బాధ్యత మనందరిపై ఉంది
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతులకు మేలు చేస్తామన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సహకార మార్కెటింగు సొసైటీ లిమిటెడ్, మహాజన సభ సమావేశమునకు డిసియంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ (చిన్న) అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా ఏపి అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. స్థానిక డిసియంఎస్ ఫంక్షను హాల్లో గురువారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సహకార మార్కెటింగు సొసైటీ లిమిటెడ్, మహాజన సభ సమావేశమునకు డిసియంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ (చిన్న) అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా ఏపి అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. సంఘము యొక్క 2026-27 ఆర్థిక సంవత్సరంకు సంబంధించిన అంచనా బడ్జెటును, సంఘపు నాన్ ఆఫిసియల్ పర్సన్ ఇంచార్చి చైర్మన్ అనుమతితో ప్రవేశపెట్టబడిన ఇతర అంశములు ఆమోదించడం జరిగింది.ఈ సందర్భంగా ఏపి అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా సహకార మార్కెటింగు సొసైటీ లిమిటెడ్ మహాజన సభలో పాల్గొనుటలో ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించి, ఆరోగ్య సమాజాలుగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిపై ఉందని, ఈ దిశగా ముందుకు అడుగులు వేస్తామని అన్నారు. యుపిఏ సేవలు ద్వారా ఫోన్ పే, గూగుల్ పే, క్యూ ఆర్ కోడ్ లు , వాట్సాఫ్ సేవలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కమర్షియల్ బ్యాంకులతో పోటీలో నిలబడుతూ, రైతులకు మంచి మేలు చేసే కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తామని తెలిపారు. సమావేశంలో సొసైటీ ప్రగతి, రైతులకు అందిస్తున్న సేవలు, భవిషత్తు కార్యాచరణ వంటి అంశాలుపై చర్చించామని అన్నారు. రైతులు అభివృద్ధి మరియు సహకారరంగం బలోపేతం కోసం సొసైటీలు మరింత కృషి చేసేలా కార్యాచరణ రూపొందించి సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. రైతులకు అవసరమైన సహాయ,సహకారాలు అందిస్తూ, వ్యవసాయ రంగం అభివృద్ధికి సహకార సంఘాలు కీలక పాత్ర పోషించేలా, పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు.ఈ సమావేశంలో డిసివో అరిమిల్లి శ్రీనివాసు, డివిజనల్ కో-ఆపరేటివ్ అధికారి కె.సత్యవతి, బిజినెస్ మేనేజరు ఇంచార్చి వెల్లంకి శివకృష్ణ మోహన్, ప్రముఖ పర్యావరణ వేత్త బొలిశెట్టి సత్యనారాయణ, మాజీ డిసియంఎస్ చైర్మన్ నడింపల్లి సత్యనారాయణ రాజు, పాలకోడేరు కోపరేటివ్ సోసైటీ అధ్యక్షులు కొత్తపల్లి నాగరాజు, సహకార సంఘాలు అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, కార్యదర్శులు, బిజినెస్ మేనేజర్లు, డిసియంఎస్, డిసిసిబి ఉద్యోగులు, సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.


