NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బడేటి శ్రీహరి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

1 min read

పవర్ పేట క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు

ప్రభుత్వం చేయూతతో పాటు,తన వంతు సహాయం చేయాలన్నదే లక్ష్యం

 ఎమ్మెల్యే బడేటి చంటి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: మానవసేవే మాధవ సేవ అన్న తలంపుతో ప్రతి గురువారం బడేటి శ్రీహరిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో  తన క్యాంపు కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. స్థానిక పవర్ పేట లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించారు. వైద్య పరీక్షలు చేయించుకున్న వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని హితవు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మీడియాతో మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గ ప్రజలకు అన్ని మేళ్లు చేకూర్చాలన్న ఏకైక లక్ష్యంతో  అహర్నిశలు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అవసరార్థులకు ప్రభుత్వ సహాయంతో పాటు తన వంతుగా చేయూతను అందించాలన్న లక్ష్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తూ  అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. ఏలూరు ఆశ్రమ ఆస్పత్రి వైద్యులు ఈ వైద్య శిబిరంలో రోగులకు పరీక్షలు నిర్వహించడంతోపాటు మందులను కూడా అందిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 19వ తేదీ గురువారం ఉగాది పండుగను పురస్కరించుకుని ముందుగానే 18వ తేదీ బుధవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఏలూరు నగర టిడిపి అధ్యక్షులు చోడే వెంకటరత్నం, నాయకులు బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్ లంకపల్లి మాణిక్యాలరావు మరియు పలువురు కార్పొరేటర్లు క్లస్టర్ ఇంచార్జిలు,డివిజన్ ఇంచార్జిలు తదితరులు పాల్గొన్నారు.

About Author