NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేశ ప్రతిష్టను దిగజార్చిన మోడీ

1 min read

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్

సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: అమెరికా ప్రయోజనాలకు లొంగిపోతూ దూర దృష్టి లేకుండా  ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రతిష్టను అమెరికాకు తాకట్టు పెట్టారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ శుక్రవారం స్థానిక పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా ను ఉద్దేశించి డేగా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రపంచంలో భారత దేశానికి అపారమైన గౌరవం ఉందని, బలహీన దేశాలకు అవసరాలను బట్టి వారికి మద్దతు పలికేదని తెలిపారు.యుద్ధం పేరుతో దేశ ప్రజలపై భారాలు మోపడం సరైన చర్య కాదన్నారు. గ్యాస్ ధరలు పెరగడం, సరఫరాలో అంతరాయం ఏర్పడిన కారణంగా చిన్నచిన్న హోటల్స్, చిరు వ్యాపారులకు ఇబ్బందికరంగా మారి వారి జీవితాలు చిన్నాభిన్నం అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించి, సరఫరా నిరంతరంగా కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సిపిఐ ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురెళ్ళ వరప్రసాద్, ఏలూరు ఏరియా సమితి కార్యవర్గ సభ్యులు కొల్లూరు సుధారాణి, శాయన అభిలాష్ కుమార్, కొండేటి బేబీ, కౌన్సిల్ సభ్యులు లక్కోజు జగదీశ్వరి, ఉప్పులూరి లక్ష్మి, భవాని, జోజి మేరీ, ఉప్పులూరి రాజమణి, పంతం సుందరమ్మ, ఉప్పులూరి పరిశుద్ధం,ఎం లలిత,డి.మణి,వి.పద్మ ,ఎం దుర్గ,ఎం సత్యనారాయణ,కె.లక్ష్మి , సత్యం,నాయుడు రంగమ్మ, చిన్నమ్మలు, వి లక్ష్మి, లోకేష్ ,ఉమా,ఆర్టీసీ లైసెన్స్ పోర్టర్స్ సభ్యులు ఆదినారాయణ,ఎస్ బాబుజి,జె రవి, ఎస్ ప్రసాద్, పి.యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు.

About Author