NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీశ్రీశ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయంలో సీతారామ కళ్యాణ మహోత్సవం

1 min read

ఏప్రిల్ 4వ తేదీన అన్నదాన కార్యక్రమం

36 సంవత్సరాలుగా కళ్యాణ మహోత్సవాలు

ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : స్థానిక అమీనాపేట 32వ డివిజన్ ఏటిగట్టు ప్రాంతంలో శ్రీ శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వస్తిశ్రీ చంద్రమా నేన శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి శుక్రవారం సీతారాముల దివ్య తిరు 36వసీతారామ కళ్యాణ మహోత్సవం శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ అత్యంత ఘనంగా కన్నుల పండుగ కమిటీ  నిర్వహించారు. మద్దుకూరి రామచంద్రరావు, అనంతలక్ష్మి సీతారాముల కళ్యాణం చేయించారు. ఈ కళ్యాణ మహోత్సవం వీక్షించడానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై భక్తికి పాత్రులై సీతారాముల ఆశీస్సులు అందుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో యలమంచిలి శేషు,నేపాలపు శ్రీనివాస్,ఏలూరి పాపారావు, ఆడపాక సాయి, టేకు శివ, సుందరినీడి నాగ వెంకట గంగాధర్ రావు తదితర కమిటీ సభ్యులు భక్తులు స్థానిక ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఏప్రిల్ 4వ తేదీన అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.

About Author